రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు
భూపాలపల్లి అర్బన్: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్.రమేశ్‌బాబు తెలిపారు. కోర్టు ప్రాంగణాల్లో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజీమార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కక్షిదారుల విలువైన సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందని అన్నారు. పంతాలు పట్టింపులకు పోయి పగలు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, సీఐ నరేష్ కుమార్, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


