అసంపూర్తి.. నిరుపయోగం
కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం పరిధి దుకాణాల సముదాయం వెనుకభాగంలో రూ.16 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల పనులు అసంపూర్తిగా మిగిలాయి. మేలో నిర్వహించిన సరస్వతినది పుష్కరాలకే ఉపయోగంలోకి తీసుకువస్తామని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. కానీ నేటికీ పనులు పూర్తికాలేదు. దీంతో మల, మూత్ర విసర్జన చేసేందుకు భక్తులు, దేవస్థానం సిబ్బంది, దుకాణాల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. – కాళేశ్వరం


