హెచ్‌ఆర్‌ఎండీఎస్‌లో బాలల దినోత్సవం
భూపాలపల్లి రూరల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని హెచ్‌ఎంఆర్‌డీఎస్ దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ దివ్యాంగ బాల బాలికలతో కలిసి బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, హెచ్‌ఎంఆర్‌డీఎస్ సంస్థ నిర్వాహకురాలు రజిత పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు
గణపురం: నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి అన్నారు. శుక్రవారం గణపురం మండలం గాంధీనగర్‌లోని హోమ్ ఆఫ్ లవ్ ఆశ్రమ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ అన్నాజాన్‌తో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కేక్ కట్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు భారంతో కూడిన విద్యను చదువకుండా ఆటపాటలతో విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ గుర్రం తిరుపతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా
బాలల దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు, నాటికలు, నృత్యాలు, పాటలు, వకృత్వ వికాస పోటీలు, వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణీయంగా చిన్నారులు తమ భవిష్యత్ కలలను ప్రతిభింబించే విధంగా వివిధ వేషాధారణలో హాజరయ్యారు.
సైన్స్ ఎగ్జిబిట్ల సందర్శన
భూపాలపల్లి అర్బన్: సింగరేణి పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన విద్యార్థుల సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిట్లను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. విద్యార్థులు సింగరేణి సంబంధించిన వివిధ ఎగ్జిబిట్లను ఉపరితల గనులను సందర్శించాలని కోరారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విద్య అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.
హెచ్‌ఆర్‌ఎండీఎస్‌లో బాలల దినోత్సవం
హెచ్‌ఆర్‌ఎండీఎస్‌లో బాలల దినోత్సవం
హెచ్‌ఆర్‌ఎండీఎస్‌లో బాలల దినోత్సవం


