రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
● కలెక్టర్ రాహుల్ శర్మ
చిట్యాల: మిల్లు యాజమాన్యం, సీసీఐ అధికారులు పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం శాంతినగర్ శివారులోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు శ్రీఆంజనేయ, కై లాపూర్ శివారులోని బాలమురగన్ కాటన్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి తేమ ఽశాతం, తూకం కాంటాలను, నమోదు వివరాలు, కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు వంటి అంశాలను క్షుణంగా పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, సీసీఐ ఇన్‌చార్జ్ పట్టాభిరామయ్య పాల్గొన్నారు.


