సమన్యాయం కోసం పాటుపడాలి
కాటారం (మహాముత్తారం): దేశంలోని ప్రతి ఒక్కరికీ సమానత్వం, సమన్యాయం కల్పించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్, రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారు ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత అన్నారు. మహాముత్తారం మండలం యామన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుజాత మాట్లాడుతూ దేశంలో ఒకే రకమైన సంస్కృతి, ఒకే రకమైన విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మనలాంటి దేశంలో సమానత్వం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతంలోని దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు పేదరికంలో ఉన్న వారికి కూడు, గుడ్డ నివాసం లాంటివి అందరికీ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేందర్, ఏఏపీసీ చైర్మన్ అంజలి, హెచ్‌ఎం రమేశ్, ఉపాధ్యాయులు తిరుపతి, విజయ్‌కుమార్, భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.


