మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు
● సిటిజన్ గ్రీవెన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
భూపాలపల్లి: స్టడీ టూర్‌లో భాగంగా జిల్లాకు వచ్చిన 12 మంది ట్రెయినీ ఐఏఎస్ అధికారులు గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ అధికారులు వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిటిజన్ గ్రీవెన్స్ గురించి వివరించి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, చేపడుతున్న పనుల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునిల్, ఏఈ రజనీకర్, టెక్నికల్ ఆఫీసర్ బి.మానస, సిస్టం మేనేజర్ విష్ణు పాల్గొన్నారు.


