రైతులను మోసంచేస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి: వరిధాన్యం కొనే సమయంలో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డీఆర్‌డీఓ, రవాణా తదితర శాఖల అధికారులతో 2025–26 వానాకాలం ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మా ట్లాడుతూ.. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాలు ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని చె ప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పరిష్కారంలో ప్రగతి ఉండాలి...
భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో ప్రగతి రాకుంటే చార్జెస్ ఫ్రేమ్ చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం తహసీల్దార్లను హెచ్చరించారు. ఆయా దరఖాస్తుల పరిష్కారంపై ఐడీఓసీ కార్యాలయంలో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో ప్రగతి కనబడకపోవడంప్లై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
బ్యాంకు హామీలు సమర్పించాలి...
వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యక్రమం సజావుగా సాగేందుకు మిల్లర్లు తక్షణమే బ్యాంకు హామీలు సమర్పించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం రవాణా, ఎండబెట్టడం, తూకం ప్రక్రియల్లో ఆటంకం రాకుండా మిల్ పాయింట్ల వద్ద తగిన కార్మికులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రైస్‌మిల్లర్లు, సివిల్ సప్‌లై అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో
ఇబ్బందులు రానివ్వొద్దు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


