రిజర్వేషన్లు భిక్ష కాదు.. హక్కు
భూపాలపల్లి రూరల్: రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదని.. తమ హక్కు అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేశ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం జిల్లాకేంద్రంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. బీసీ ప్రతి రంగంలో వెనుకబడి ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో బీసీ ఉద్యమాన్ని గ్రామగ్రామాన బలోపేతం చేస్తూ రిజర్వేషన్లు సాధించేంత వరకు మొక్కవోని దీక్షతో కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, బీసీ జేఏసీ జిల్లా కమిటీ కో కన్వీనర్లు బర్ల గట్టయ్య పటేల్, గుమ్మడి ప్రదీప్ పటేల్, అమృత అశోక్ కురుమ, శేఖర్ నాని, బీసీ జేఏసీ మహిళా చైర్‌పర్సన్ మేకల రజిత, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవి కుమార్, బీసీ అజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్ పాల్గొన్నారు.
దీక్షకు పలువురి మద్దతు
దీక్షకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కౌటం రవి పటేల్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి ముద్దమల్ల భార్గవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగల రాజేందర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గీసా సంపత్ మద్దతు తెలిపారు.


