నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
భూపాలపల్లి రూరల్/ కాటారం/రేగొండ: రైతులు అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్తలు హరి, వెంకటరాజుకుమార్, ఓంప్రకాశ్, ప్రశాంత్ అన్నారు. నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రా మం, రేగొండ, కొత్తపల్లిగోరి, కాటారం మండలా ల్లో బుధవారం శాస్త్రవేత్తల బృందం వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వరి పంటలను సందర్శించారు. రిరకం వరి రకం డబ్ల్యూజీఎల్–96 2 గుణ, గణాలు, ఇతర విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు స తీష్, పూర్ణిమ, వాసుదేవరెడ్డి, సారయ్య, ఏఈఓ రా జన్న, సోని, ప్రణయ్, రైతులు పాల్గొన్నారు.


