దళారుల దందా! | - | Sakshi
Sakshi News home page

దళారుల దందా!

Nov 13 2025 8:08 AM | Updated on Nov 13 2025 8:08 AM

దళారు

దళారుల దందా!

దళారుల దందా!

గత్యంతరం లేని పరిస్థితిలో..

‘ప్రైవేట్‌’ కొనుగోళ్లను అరికట్టాలి

నాణ్యమైన పత్తికి మద్దతు ధర

పంబపూర్‌లో పత్తి కొనుగోలు చేస్తున్న ప్రైవేట్‌ వ్యాపారి (ఫైల్‌)

భూపాలపల్లి రూరల్‌: గ్రామాల్లో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ అది కొంతమంది రైతులకు మాత్రమే లభించగా మిగతా వారంతా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తి రైతులకు చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఏటా ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తేమ పేరిట కొర్రీలు పెట్టడంతో గత్యంతరం లేక ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట ఏరేందుకు కూలీల ఖర్చు, సాగుకు తెచ్చిన అప్పులు చెల్లించాల్సి ఉండటంతో పత్తిని ఇంట్లో నిల్వ చేసుకోలేక ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో వారు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

తగ్గిన దిగుబడి

సాగు పెట్టుబడి ఎకరాకు రూ.40వేల వరకు ఖర్చు అయినట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన ఉండగా వర్షాలతో పంట దెబ్బతినడంతో ఎకరాకు 8 క్వింటాళ్లు కూడా దిగుబడి రావడంలేదని, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని వాపోతున్నారు. సాగుకు తెచ్చిన అప్పులు తీరే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉండడంతో చేతికొచ్చిన పంట దిగుబడిని అగ్గువకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.

సీసీఐ అధికారులు 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే మార్కెట్‌లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్‌ వ్యాపారులు రైతుల నుంచి అందినకాడికి దండుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో చిట్యాల మండలంలో 2, కాటారంలో 2, భూపాలపల్లిలో 1 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మద్దతు ధర రూ.7,521 ఉండగా, ప్రైవేట్‌ వ్యాపారులు తేమ పేరిట కోత విధించడంతో క్వింటాకు రూ.6,500 నుంచి రూ.7,000లకు కొనుగోలు చేస్తున్నారు గతనెల చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సీసీఐ ఇప్పటి వరకు 552 మంది రైతుల నుంచి 9,169 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్‌ వ్యాపారులు 466 మంది రైతుల నుంచి 4,539 క్వింటాళ్ల కొనుగోలు చేసినట్లు అధికారుల లెక్కలు ఉన్నాయి. రైతులకు అవగాహన లేక కొంత మంది తేమ శాతం 8 ఉన్నప్పటికీ ట్రాక్టర్‌ అద్దె, తదితర ఖర్చులు లెక్కలు వేసుకొని గ్రామాల్లో ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు.

గ్రామాల్లో విచ్చలవిడిగా ‘ప్రైవేట్‌’ పత్తి కొనుగోళ్లు

తేమ పేరిట సీసీఐ కొర్రీలు

కొందరికే అందుతున్న ‘మద్దతు’

చిత్తవుతున్న పత్తి రైతులు

జిల్లాలో 5 సీసీఐ కొనుగోలు కేంద్రాలు

గ్రామాల్లో ప్రైవేట్‌ వ్యాపారులు విచ్చలవిడిగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. అధికారులు గుర్తించి దళారుల దందాను అరికట్టాలి. వర్షాల కారణంగా పత్తి దిగుబడి, నాణ్యత తగ్గింది. ప్రభుత్వం సీసీఐ నిబంధనలను సడలించి ఎలాంటి కర్రీలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.

– కార్నటకపు సమ్మయ్య,

రైతు స్వరాజ్యవేదిక జిల్లా కన్వీనర్‌

నిబంధనల మేరకు సీసీఐ కి పత్తిని ఆరబెట్టి తీసుకొస్తే మద్దతు ధర లభి స్తుంది. గ్రామాల్లో ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దు. గ్రామాల్లోనే రైతులు పత్తిని ఆరబెట్టుకుని తీసుకురావాలి.

– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

దళారుల దందా!1
1/3

దళారుల దందా!

దళారుల దందా!2
2/3

దళారుల దందా!

దళారుల దందా!3
3/3

దళారుల దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement