కార్పొరేట్ స్థాయిలో విద్యాభివృద్ధి
కాళేశ్వరం: మారుమూల పల్లెల్లో కార్పొరేట్ స్థాయి విద్యాభివృద్ధికి సౌకర్యాలను అందించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు డ్యు యల్ డెస్క్‌లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం మహాదేవపూర్ మండలం జెడ్పీపాఠశాల విద్యార్థులకు డ్యుయల్ డెస్క్ లు, ఆదివాసీ గిరిజన భవనంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వయాట్రీస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కాటారం డివిజన్ పరిధిలోని 26 పాఠశాలలకు మొదటి విడతలో 226, రెండో విడతలో 56 డ్యుయల్ డెస్క్‌లు అందించినట్లు తెలిపారు. అనంతరం ఆదివాసీ గిరి జన భవనంలో మహిళా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరిగిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మహిళల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. కుట్టుమిషన్లు పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సీఎస్‌ఆర్ నిధులతో డ్యూయల్ డెస్క్‌లు, కుట్టు మిషన్లు అందించిన వయాట్రీస్ ప్రతినిధి హనీష్‌ను అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీఆర్డీఓ బాలకృష్ణ, ఎంపీడీవో రవీంద్రనాథ్, సీడీపీఓ రాధిక, వయాట్రీస్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి,రాణిబాయి, అరుణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సాదాబైనామా దరఖాస్తుల్లో వేగం పెంచాలి
భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం మహదేవపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. ప్రతీ దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని, తిరస్కరణ జరిగితే తగిన కారణాలు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, తహసీల్దార్ రామారావు, నాయబ్ తహసీల్దార్ కృష్ణ, తదితరులు ఉన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కలెక్టర్ రాహుల్ శర్మ


