సందడిగా వైట్‌కోట్ ఉత్సవం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు వైట్‌కోట్ ఉ త్సవం నిర్వహించారు. బుధవారం కళాశాల ప్రిన్సి పాల్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్వ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. నూతన విద్యార్థులకు వైట్‌కోట్ (యునిఫాం) తొడిగి వైద్య వృత్తి ప్రా ధాన్యాన్ని, సేవా దృక్పథం, నైతిక విలువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, జీఎం రాజేశ్వర్‌రెడ్డి, కేటీపీపీ సీఈ ప్రకాష్, వైద్యవిద్య విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


