పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి
● డీఎస్పీ సంపత్‌రావు
చిట్యాల: పోలీసులు ప్రజలతో నిష్పక్షపాతంగా ఉండాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. మంగళవారం చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న, పరిష్కారమైన కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాల పద్ధతులు, వివరాలపై ఆరా తీశారు. లాకప్, ఆయుధాగారం, స్టేషన్ పరిసరాల శుభ్రతను పరిశీలించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ కచ్చితమైన క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని పోలీసులకు ఆదేశించారు. పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండి ప్రతి ఫిర్యాదుదారుడి పట్ల సానుకూలంగా వ్వవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్సైలు శ్రావన్‌కుమార్, హేమ, ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది సురేందర్, చంద్రమౌళి, గిరి, సందీప్, అస్లాంజానీ, లాల్‌సింగ్, నాగరాజు, సందీప్, క్రాంతికుమార్, రంజిత్, శ్రీనివాస్, నాగమణి, శ్రావని, మమత, లలిత, పాల్గొన్నారు.


