ఆజాద్ సేవలు చిరస్మరణీయం
భూపాలపల్లి రూరల్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశం హాలులో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, ఏఓ మురళీధర్, పర్యవేక్షకులు అబ్బాస్ పాల్గొన్నారు.


