మాంసం దుకాణాలే అడ్డా
జిల్లాకేంద్రంలో విచ్చలవిడిగా వీధికుక్కల సంచారం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏదో ఒక మూలన ప్రతీ రోజు కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్కలకు వివిధ రకాల వ్యాధుల బారిన పడిన వాటిని పట్టించుకోవడం లేదు. రోడ్లుపైనే సంచరించడం వలన పట్టణ ప్రజలు జంకుతున్నారు. ఏండ్ల తరబడి కుక్కలు విపరీతంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాటిని నివారించాలని వినతులు అందించి, మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. కుక్కల సంచారాన్ని నివారించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో 900 కుక్కలు సంచరిస్తున్నట్లు పశుసంవర్ధశాఖ అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో గతేడాది ఒక మహిళ కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. మున్సిపల్ పరిధిలో ప్రతీ నెల 150 నుంచి 200 మందిని కుక్కలు కరుస్తున్నాయి.
కుక్కల సంతతి పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించాం. ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ జారీ చేశాం. అతి త్వరలోనే కుక్కలను పట్టుకొని ఇంజక్షన్‌లు ఇచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తాం.
– శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్
నివారణ చర్యల్లో
మున్సిపల్ అధికారుల విఫలం
ప్రతీ నెల 150 నుంచి 200 మందికి కుక్క కాటు
మాంసం దుకాణాలే అడ్డా
మాంసం దుకాణాలే అడ్డా


