పెండింగ్ పనులు చేయండి
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల పెండింగ్ పనులన్నీ సంక్రాంతిలోపు పూర్తిచేయాలని జెన్‌కో సీఎండీ, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి కాళేశ్వరంలో పర్యటించారు. ముందుగా వీఐపీఘాటు వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. పుష్కరాల సమయంలో కాళేశ్వరం గోదావరి మెయిన్ ఘాట్ వద్ద చేపట్టిన ఆర్చి నిర్మాణంలో జాప్యంపై దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఇంత అలసత్వమా.. చర్యలు తప్పవని హెచ్చరించారు. మళ్లీ డిసెంబర్‌లో వస్తానని అప్పటివరకు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటానన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టిన ఆర్చి నిర్మాణం ఇంతవరకు పూర్తి చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు ప్రతిష్టాత్మకమైనవని, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా అత్యుత్తమ నాణ్యత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. పనుల్లో వేగం, పారదర్శకత తప్పనిసరి ఉండాలని నిర్లక్ష్యం చూపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇతరశాఖలకు బదిలీ చేస్తానన్నారు.
కాళేశ్వరాలయంలో పూజలు..
కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం వారికి ఆలయ అదికారులు, అర్చకులు వేదపండితుల మంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈఓ మహేష్ వారిని శాలువాతో సన్మానించారు. కల్యాణ మండపం వద్ద అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఏసీ సునీత, తహసీల్దార్ రామారావు, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, ఏఈఈ శ్రీకాంత్, డీటీ కృష్ణ, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, కార్యదర్శి సత్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పూర్తికాకపోతే
ఇతర శాఖకు బదిలీ చేస్తా..
జెన్‌కో సీఎండీ, దేవాదాయశాఖ
కమిషనర్ హరీశ్
దేవాదాయశాఖ ఇంజనీర్లపై ఆగ్రహం
పెండింగ్ పనులు చేయండి


