ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తే చర్యలు

Nov 12 2025 6:07 AM | Updated on Nov 12 2025 6:07 AM

ఫేక్‌

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తే చర్యలు

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తే చర్యలు మొదటి బహుమతి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి మే 21నుంచి అంత్యపుష్కరాలు నిరవధిక దీక్ష భగ్నం

భూపాలపల్లి అర్బన్‌: వాహనాలకు ఫేక్‌ నంబర్‌ ప్లేట్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దపూర్‌ గ్రామానికి చెందిన గట్టు వినోద్‌ తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన టీఎస్‌ 25 ఏ5921 నంబర్‌ను పట్టణంలోని కారల్‌మార్క్స్‌కాలనీకి చెందిన కలవేన మల్లేశ్‌ తన వాహనానికి పెట్టుకున్నాడు. గుర్తించిన పోలీసులు మల్లేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కాళేశ్వరం: తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌ కోరప్స్‌ ఆధ్వర్యంలో కాటారం సబ్‌ డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన సబ్‌ డివిజన్‌ స్థాయి ‘వేస్ట్‌ టూ వెల్త్‌’ పోటీలో మహదేవపూర్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు అక్షిత్‌ సాయి, దత్త సాయి, అక్షీత్‌, హర్షిత్‌, అఖిల్‌ తయారు చేసిన ప్రాజెక్టు మొదటి బహుమతి సాధించింది. దీనికి గైడ్‌ టీచర్‌గా ఆంజనేయులు వ్యవహరించారు. మొదటి బహుమతి పొందిన విద్యార్థులను హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయలు సరిత, మడక మధు, సుధారాణి, సరితా దేవి, ఓలిపాషా, రజిత, లీలారాణి, ప్రసూనా, సమ్మయ్య, వీరేశం, వసధ ప్రియా, దీపిక, పూర్ణిమ అభినందించారు.

చిట్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఏబీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్‌ కోరారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ షేక్‌ ఇమామ్‌బాబాకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా అధి కారులు స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రామ్‌, జశ్వంత్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు రాష్ట్ర ప్రభుత్వం సరస్వతినది పుష్కరాలను వైభవంగా నిర్వహించింది. వచ్చే ఏడాది మే 21 నుంచి సరస్వతినదికి అంత్యపుష్కరాలను దేవాదాయశాఖ లాంఛనంగా నిర్వహించడానికి పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మే 21నుంచి 12 రోజుల పాటు అంత్యపుష్కరాల నిర్వహణకు తగు ప్రణాళికలను ఆ శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సి పనులు, పెండింగు పనులపై దృష్టిసారిస్తున్నారు.

కాటారం: కాటారం సబ్‌ డివిజన్‌ను రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్‌ మండలకేంద్రంలో చేపట్టిన నిరవధిక దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేపట్టిన సమాచారం అందుకున్న పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకొని శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీక్ష భగ్నం చేసి అరెస్ట్‌ చేయడం అమానుషమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌, రాజేందర్‌ మాట్లాడుతూ దీక్షకు కూర్చున్న మూడు గంటల్లోనే పోలీసులు భగ్నం చేశారని, శాంతియుతంగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్ష చేపడితే పోలీసులు అడ్డుకట్ట వేయడం సరికాదన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి డిమాండ్లను పరిష్కరించకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వంగాల లక్ష్మి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్‌, యంగ్‌ ఉమెన్స్‌ జిల్లా కన్వీనర్‌ బందు సుజాత, కోకన్వీనర్‌ స్వాతి, ఆత్కూరి శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌  వినియోగిస్తే చర్యలు
1
1/2

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తే చర్యలు

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌  వినియోగిస్తే చర్యలు
2
2/2

ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement