ఇవే ప్రధాన అడ్డాలు..
భూపాలపల్లి కోల్‌బెల్ట్ ప్రాంతం కావడంతో మాంసం దుకాణాలు అధికంగా ఉన్నాయి. అంబేడ్కర్ సెంటర్, గణేష్‌చౌక్, మంజూర్‌నగర్‌లలో ప్రధాన రహదారిపై చికెన్, మటన్ దుకాణాల ఎదుట వీధి కుక్కలు అధికంగా సంచరిస్తున్నాయి. వ్యక్తులను కరవడమే కాకుండా ద్విచక్ర వాహనాలకు అడ్డు వస్తున్నాయి. దీంతో పలువురు ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది కళ్లముందే కుక్కలు సంచరిస్తున్నా వారి కళ్లకు కనిపించనట్లు వ్యవహరిస్తున్నారు.
కృష్ణకాలనీలో కుక్కలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు చిన్నారులను కరుస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట పలుమార్లు ధర్నా చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటికి వస్తే ఎక్కడ కుక్కలు పీకుతాయేననే భయం ఉంది.
– గోలి లావణ్య, కృష్ణకాలనీ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు ప్రారంభించారు. కుక్కల నియంత్రణ లేకపోతే కుక్కకాట్లు పెరిగి రేబిస్ వ్యాధి పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రమాదానికి గురైనవారు అనేక మంది ఉన్నారు. కుక్కలు కరవడంతో పాటు ద్విచక్ర వాహనాలకు అడ్డువస్తున్నాయి.
– ఎండీ యాకూబ్‌పాషా,
కారల్‌మార్క్స్‌కాలనీ
ఇవే ప్రధాన అడ్డాలు..
ఇవే ప్రధాన అడ్డాలు..


