కాళేశ్వరాలయంలో కార్తీక శోభ
● ఆలయానికి రూ.4.80లక్షల ఆదాయం
కాళేశ్వరం: కార్తీమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు చేసి అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు, దీపాలు వెలిగించారు. దీపారాధనలు చేసి బ్రాహ్మణోత్తములకు దీప దానం చేశారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమం అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ఉచిత ప్రసాదం, తాగునీరు అందజేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. సుమారుగా 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా వేశారు. వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాల ద్వారా రూ. 4.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు.
కాళేశ్వరాలయంలో కార్తీక శోభ
కాళేశ్వరాలయంలో కార్తీక శోభ


