
కుంటుపడుతున్న అభివృద్ధి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్ర అభివృద్ధికి కేటాయించిన నిధులను మళ్లించడంతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆగిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పున:ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని సుభాష్‌కాలనీరోడ్డు బస్టాండ్ ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ సెంటర్ నుంచి కేటీకే ఓపెన్ కాస్టు–2 ప్రాజెక్ట్ వరకు రూ.10కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు మూడేళ్ల క్రితం బీఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనులు పూర్తి చేయించకుండా రూ.4కోట్ల నిధులను వేరే మండలానికి మళ్లించినట్లు తెలి పారు. పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టేందుకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి