
‘హేమాచలక్షేత్రంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలి’
మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు కలెక్టర్ దివాకరకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వివిధ సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, సుమారు 60 అడుగుల ఎత్తులో గుట్టపై ఉన్న ఆలయం వద్దకు మెట్లపై నడిచి వెళ్లేందుకు దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులు గుట్టపైకి చేరుకునేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణరావు, గోపాల్‌రావు, మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.