
విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో సెక్యూరిటీ సిబ్బంది సమర్థవంతంగా నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సింగరేణి సెక్యూరిటీ జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం ఏరియాలోని సింగరేణి చెక్ పోస్టులు, భద్రత చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి భద్రతను పటిష్టం చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలో 64 అత్యాధునిక ఫాబ్రికేటెడ్ చెక్ పోస్ట్ గదులను కొనుగోలు చేసి వాటిని ఏరియాలకు పంపిస్తామని తెలిపారు. భద్రతా విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, సీనియర్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మిరాజం, జమేదార్‌లు బుచ్చయ్య, రవీందర్ పాల్గొన్నారు.