
డెంగీ దోపిడీ
న్యూస్‌రీల్
సాధారణ జ్వరానికి ఆస్పత్రిలో అడ్మిట్
ఆందోళన వద్దు..
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పిల్లలు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ తీవ్ర అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వీరి రాకతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేక చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీనిని అదనుగా తీసుకుంటున్న కొందరు వైద్యులు.. ‘మీ కండీషన్ సీరియస్‌గా ఉంది. ప్లేట్‌లెట్స్ పడిపోయినయ్’ అంటూ భయపెడుతున్నారు. సాధారణ జ్వరంతో ఏ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. సీజనల్ వ్యాధులు వస్తే చాలు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు పండుగే. వానాకాలం వారికి కాసుల వర్షం కురిపించే సీజన్‌గా మారుతోంది. మామూలు జ్వరంతో అని వెళ్లినా సరే.. రూ.వెయ్యి నుంచి రూ.2వేల మందులు (ఔషధాలు) రాస్తుస్తున్నారని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 47 డెంగీ కేసులు నమోదయ్యాయని, అనధికారిక చికిత్స తీసుకుంటున్న వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని, దీంతో డెంగీ కేసులు తక్కువగా నమోదవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
రక్త కణాలు తీవ్రంగా తగ్గితేనే..
సాధారణంగా ఆరోగ్యవంతుని శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య సంఖ్య 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ బారినపడితే వీటి సంఖ్య తగ్గుతుంది. 20 వేల కన్న ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినప్పుడే ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎక్కువశాతం మందిలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుదల ప్రారంభమైన మూడు రోజుల తరువాత నుంచి ఇచ్చే బయాటిక్స్, ఇతర ముందులతో సంఖ్య పెరుగుతుందని వివరిస్తున్నారు. దీంతో భయపడాల్సిదేమీ లేదని పేర్కొంటున్నారు.
ఒప్పందాలను అమలు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జిల్లాకేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి జ్వరం రావడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌కు చూపించగా రక్త పరీక్షలు చేశారు. రక్తకణాలు తగ్గాయని డెంగీ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. రక్త పరీక్షలకు రూ.1500 తీసుకొని, మూడు రోజులు అడ్మిట్ చేసుకొని రూ.15వేల బిల్లు వేశారు.
ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిందంటూ
జేబులు గుల్ల
రోగులను పిండేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి టెస్టుల పేరుతో ఇబ్బందులకు గురికావద్దు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో టీ హబ్‌లో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. పీహెచ్‌సీ వెళ్లి రక్త నమూనాలు అందజేస్తే 24గంటలలోపు రిపోర్టు వస్తుంది. ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గటం సహజం. రక్తంలో 2 లక్షల నుంచి 4.5లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నా ప్రమాదం లేదు. డెంగీ కేసుల్లో 10శాతం మందికే ఆస్పత్రిలో అడ్మిషన్ అవసరం. కానీ చాలామంది జ్వరం వచ్చిన మరుసటిరోజే వెళ్లి డెంగీ టెస్ట్, సీబీపీ చేయించుకుంటున్నారు. నాలుగైదు రోజుల తర్వాత కూడా ఫీవర్ అలాగే ఉంటే అప్పుడు టెస్టులు చేయించుకోవాలి.
– డాక్టర్ చల్ల మధుసూదన్, డీఎంహెచ్‌ఓ

డెంగీ దోపిడీ

డెంగీ దోపిడీ

డెంగీ దోపిడీ

డెంగీ దోపిడీ