
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కాటారం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. మండలకేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడాపోటీలను చైర్‌పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ తిరుమల మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యత పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అండర్–14, అండర్–17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాబు, ఎస్సై శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సమ్మయ్య, ప్రిన్సిపాల్ రాజేందర్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి లా షరీఫ్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డైరెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్, టీఏ మనోజ్, ఎఫ్‌ఏ రాజమణి పాల్గొన్నారు.
మార్కెట్ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల