
ఘనంగా ఇంజనీర్స్ డే
భూపాలపల్లి అర్బన్: ప్రపంచ ఇంజనీర్స్ డేను సోమవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి జీఎం రాజేశ్వర్‌రెడ్డి హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంజనీర్ వృత్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని జీఎం తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఇంజనీర్‌లను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ జీఎం మధుసూదన్, ఎస్‌వోటు జీఎం కవీంద్ర, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.
మైన్స్ రెస్క్యూ సిబ్బందికి అభినందనలు
ఇటీవల రామగుండం ఏరియాలో జరిగిన జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన ఏరియా మైన్స్ రెస్క్యూ సిబ్బందిని సోమవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు కవీంద్ర, జోతి, రవికుమార్, ప్రసాద్, పూర్ణచందర్, సిబ్బంది పాల్గొన్నారు.