
రాజీమార్గమే ఉత్తమం
– వివరాలు 8లోu
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు
భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్‌బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమేశ్‌బాబు పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని రాజీ పడి కేసుల నుంచి బయటపడాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ.. క్షమాగుణాన్ని కలిగి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరూ సోదరాభావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్‌కుమార్‌నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, లేబర్ అధికారి వినోద, జీపీ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, న్యాయవాదులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే
హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్
డీసీసీబీ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు