
పటిష్టమైన భద్రత ఉండాలి
భూపాలపల్లి: ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వీవీ ప్యాట్, ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన వీవీ ప్యాట్ యంత్రాలు, ఈవీఎంల భద్రత, సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా పర్యవేక్షణ, సీల్ వేసిన తాళాలను చూశారు. గోదాంల వద్ద లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, పర్యవేక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అబ్బాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ