
సొంతింటి కల నెరవేరుస్తాం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హమీ ప్రకారం సొంతింటి కల నెరవేరుస్తామని ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యుడు నరసింహరెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసింహరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రగతిలో కార్మికులు పునాదులుగా నిలుస్తున్నారని తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. దసరా పండగలోపు కార్మికులు 35శాతం లాభాల వాటా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుకర్‌రెడ్డి, బుచ్చయ్య, రాజేందర్, రఘుపతిరెడ్డి, వేణుగోపాల్, రమేష్, చక్రపాణి, రవికిరణ్, నర్సింగరావు, సమ్మయ్య, శ్రీనివాస్, శ్రవణ్‌కుమార్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.