న్యూస్‌రీల్
జిల్లాలో యూరియా వివరాలు..
జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
మల్హర్: తాడిచర్ల సొసైటీకి మంగళవారం 444 బస్తాలు, కొయ్యూరులోని ఓ ప్రైవేట్ దుకాణానికి 200 బస్తాలు వచ్చాయి. రైతులు తెల్లవారు జాము నుంచి భారీగా చేరుకున్నారు. కొయ్యూరు పోలీసులు పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని లైన్‌లో ఒక్కొక్కరికి టోకోన్ అందించి, ఒక్క రైతుకు ఒక్క బస్తా మాత్రమే అందించారు. గంటల తరబడి వేచి ఉన్నా ఒక్క బస్తా మాత్రమే అందించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు అందని రైతులు ఇంటి ముఖం పట్టారు.
చిట్యాల: మండలకేంద్రంలోని ఆగ్రో ఏజన్సీస్ షాపు వద్దకు రైతులు మంగళవారం ఒక్కసారిగా రావడంతో గందరగోళం చోటుచేసుకుంది. పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీ చేశారు. అనేక మంది రైతులు క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడ్డా దొరకకపోవడంతో ఆగ్రహంతో వెనుదిరిగారు.
టేకుమట్ల: మంగళవారం ఆగ్రోస్–2కు ఒక లోడు యూరియా వచ్చింది. రైతులు మండల కేంద్రానికి చేరుకుని యూరియా కోసం ఎగబడ్డారు. లారీ నుండి నేరుగా యూరియా బస్తాలను తీసుకెళ్లారు. సుమారు మూడు గంటల పాటు ఫర్టిలైజర్ దుకాణం ఎదుట పడిగాపులు కాశారు.
మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని పరకాల–జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
భూపాలపల్లి: జిల్లాలో యూరియా కొరత తీవ్రతరమైంది. మొక్కదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వర్షంలో గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడగా కొందరికి ఒక్కో బస్తా చొప్పున అందగా, వందలాది మంది రైతులు ఉట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు.
వర్షంలో గంటల తరబడి నిలబడినా..
రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వరిసాగు నెల రోజులు ఆలస్యంగా జరుగుతుంది. ప్రస్తుతం వరి, పత్తి, మిర్చి సాగు చేస్తున్న రైతులకు ప్రధానంగా యూరియా అవసరం ఉంది. ఈ సమయంలోనే తీవ్ర కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం జిల్లాలోని భూపాలపల్లి మండలం జంగేడు, మహదేవపూర్, చిట్యాల, గణపురం మండల కేంద్రాలకు ఒక్కో లారీ లోడ్ చొప్పున యూరియా బస్తాలు వచ్చాయి. యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచే పీఏసీఎస్ గోడౌన్‌ల వద్ద బారులుదీరారు. ఒక్కో దగ్గర వేయి మందికి పైగా రైతులు క్యూలైన్‌లో ఉన్నారు. పోలీసుల పహారాలో లారీలోని 400 బస్తాలను అధికారులు మొదట ఉన్న రైతులకు ఒకటి చొప్పున మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. తమ పంటల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. ప్రతీ మండలానికి ఐదారు రోజులకు ఒక లోడ్ మాత్రమే వస్తుందని, యూరియా లేక పంటలు ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు.
కావాల్సింది 42,331 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు వచ్చింది 11,200 మెట్రిక్ టన్నులు రావాల్సింది 31,131 మెట్రిక్ టన్నులు
పోలీసుల పహారాలో పంపిణీ
లారీ లోడ్ వస్తే క్యూలైన్లలో వేయికి పైగా రైతులు
వందలాది మందికి అందని యూరియా
పాస్‌బుక్‌కు ఒకే బస్తా
పాస్‌బుక్‌కు ఒకే బస్తా
పాస్‌బుక్‌కు ఒకే బస్తా
పాస్‌బుక్‌కు ఒకే బస్తా