
ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం జంగేడు పీఏసీఎస్ ఎదుట రైతులు ఉదయం ఏడు గంటల నుంచే యూరియా కోసం బారులుదీరారు. యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని ఉదయం 11గంటలకు రైతులు ఆందోళన చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక్క రైతు కుటుంబానికి ఒక బస్తా పంపిణీ చేశారు.
రేగొండ: మండల కేంద్రంలోని ఆగ్రోస్‌కు మంగళవారం ఉదయం 444 బస్తాల యూరియా రాగా, పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే రైతులు బారులుదీరారు. రెండు రోజుల క్రితం రైతువేదికల వద్ద టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే యూరియా పంపిణీ చేయడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.