
యూరియా అందించడంలో విఫలం
మల్హర్: రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లలో నిలబడినా సరిపడా దొరకడం లేదన్నాన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మల్హర్: సింగరేణి కాలరీస్ ఆధ్యర్యంలో నిర్వహించిన 55వ సేఫ్టీ పోటీల్లో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ప్రతిష్టాకరమైన ‘బెస్ట్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఇన్ ఓపెన్ కాస్ట్ మైన్స్’ అవార్డుకు ఎంపికై ంది. సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆగస్టు 31న మంచిర్యాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మైన్ ఏజెంట్ జీవ కుమార్, మైన్ మేనేజర్ శ్రీనివాస్, మైన్ సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, జెన్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్, మైన్ ఇంజనీర్ రాజు, వర్క్ మాన్ ఇన్‌స్పెక్టర్ సదానందం, రోడ్డ నరేష్ అవార్డును అందుకున్నారు.
కాళేశ్వరం: యూరియా మహారాష్ట్రకు అక్రమంగా తరలిపోకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, మండల రెవెన్యూ సిబ్బంది మంగళవారం తనిఖీలు చేపట్టారు. రాష్ట్రం నుంచి ఎవరైనా యూరియాను మహారాష్ట్రకు తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
భూపాలపల్లి అర్బన్: సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ రఘు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ఉద్యోగులు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరుకావాలని సూచించారు. ఈ నెల 5వ తేదీలోపు డీవైఎస్‌ఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 96180 11096, 81251 13132 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్‌పీపుల్స్, గేమ్స్ అసోసియేషన్ భూపాలపల్లి ఏరియా స్థాయి కబడ్డీ క్రీడాపోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ఈ క్రీడాపోటీలకు ఏరియా సివిల్ ఏజీఎం రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలు కేవలం ఆనందం మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమన్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యువ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య, జనరల్ కెప్టెన్ మల్లేశ్, కబడ్డీ కెప్టెనన్‌్ గణేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్టుల నుంచి ఉప్పల్‌కు బొగ్గు రవాణా చేసే టిప్పర్‌కు ప్రతి టన్నుకు రూ.250 చెల్లించాలని టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రోడ్డ రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏరియాలోని అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్స్ టిప్పర్ అసోసియేషన్‌కు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ప్రభాకర్, అశోక్, తిరుపతి, రమేష్, శ్రీనివాస్, మధుకర్‌రెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు.