
పేదల పక్షపాతి వైఎస్సార్
చిట్యాల: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన గొప్ప మహనీయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, నాయకులు దబ్బెట రమేష్, ముకిరాల మధువంశీకృష్ణ, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు