ప్రజలకు సులభంగా సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు సులభంగా సేవలు

Sep 3 2025 4:35 AM | Updated on Sep 3 2025 4:35 AM

ప్రజలకు సులభంగా సేవలు

ప్రజలకు సులభంగా సేవలు

చిట్యాల: ప్రజలకు సులభంగా సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కిరణ్‌ఖరే కోరారు. ఈ సందర్భంగా మంగళవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన రిసెప్షన్‌ కౌంటర్‌ రూంను ఆయన ప్రారంభించారు. వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్‌ రికార్డులు, కేసుల రిజిస్టర్లు , ఎఫ్‌ఐఆర్‌ కాఫీలు, స్టేషన్‌ డైరీ తదితర అంశాలపై పరిశీలించారు. కేసుల దర్యాప్తు వేగంగా, పారదర్శకంగా జరగాలని పోలీసులకు సూచించారు. అనంతరం పోలీస్‌ష్టేషన్‌ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్‌, ఎస్సై శ్రావన్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ కిరణ్‌ఖరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement