
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
భూపాలపల్లి: జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి మంగళవారం కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణరహిత గణేషులనే ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, సీపీఓ బాబురావు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ