
గణపతి నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి వద్ద గణపతి నిమజ్జనం ఏర్పాట్లను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ తహసీల్దార్ రామారావు సోమవారం పరిశీలించారు. ఈనెల 5న నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర వంతెన వద్ద అన్నిశాఖల అధికారులతో రెండు చోట్ల పరిశీలన చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వినాయక ప్రతిమలు తరలివస్తాయని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం కాళేశ్వరం పోలీసుస్టేషన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గజ ఈతగాళ్లు, ఎన్పీడీసీఎల్, దేవాదాయశాఖ, ఎకై ్సజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.