
గోదావరి జలాలతో అభిషేకం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్థూపానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పూరితంగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.