
ప్రతీ ఫిర్యాదుకు ప్రాధాన్యం ఇవ్వాలి
భూపాలపల్లి: ప్రజాదివస్‌లో వచ్చే ప్రతీ ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రిపూట గస్తీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే