
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
కాళేశ్వరం: వర్షాల నేపథ్యంలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం కాళేశ్వరం పీహెచ్‌సీ, వ్యర్థాలను దహనం చేసే యంత్రం, సరస్వతీ ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్‌శాఖకు తెలిపారు. పోలీసుశాఖ నిరంతరం గోదావరి వద్దకు వచ్చే భక్తులపై నిఘా ఉంచాలని ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే స్పందించాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక రెవెన్యూ అధికారులను లేదా కంట్రోల్ రూం 90306 32608 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన విద్యార్థులు కోల శాన్వి, నాగుల తులసి, గంట హరిచందన హకీంపేట్ స్పోర్ట్స్ పాఠశాలకు ఎంపికై న సందర్భంగా వారిని, కోచ్‌ను అభినందించారు.
సృజనాత్మకతను వెలికితీస్తే అద్భుతాలు
విద్యార్ధులు ఒక నిర్ధేశ లక్ష్యంతో చదివితే అనుకున్న లక్ష్య సాధనకు చేరుతారని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. కాళేశ్వరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంలో న్యూటన్ సిద్ధాంతాలపై నిర్వహించిన దశవధానంపై చేసిన అంశం, మరో 12 మంది విద్యార్థుఽలు రసాయనశాస్త్రంలోని 118 మూలకాల పేర్లు ఎనిమిది సెకన్ల వ్యవధిలో చదవడంతో ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటుదక్కింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థిని అక్షయ, గౌడ్ టీచర్ రాజేందర్‌లను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రశంసా పత్రం, మెడల్‌ను అందచేశారు. మిగితా విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ సిద్ధం అరుణ్ కుమార్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రామారావు, ఎంఈఓ ప్రకాశ్‌బాబు పాల్గొన్నారు.
సమగ్ర పర్యవేక్షణకు
క్లస్టర్ అధికారుల నియామకం
భూపాలపల్లి: జిల్లాలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు, ప్రజాసేవల అమలుపై సమగ్ర పర్యవేక్షణకు క్లస్టర్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల్లో ప్రభుత్వ సేవల అమలు, రెగ్యులేటరీ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పటిష్టమైన పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత మండలాలకు క్లస్టర్ అధికారులుగా నియమించిన అధికారులు మండల ప్రత్యేక అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు.
రుణమాఫీ కోసం సిఫారసు..
జిల్లాలో అర్హత కలిగిన 140 మంది చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ ఆమోదించి, రాష్ట్ర కమిటీకి సిఫారసు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత శాఖ ఏడీ శ్రీకాంత్‌రెడ్డి, వరంగల్ సీఈఓ వజీర్ సుల్తాన్, ఎల్డీఎం తిరుపతి, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి..
జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాలను జారీ చేయడానికి అర్హుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మల్లీశ్వరి, డీటీవో సంధాని తదితరులు పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితుల కోసం
కంట్రోల్‌రూం ఏర్పాటు
పోలీసుశాఖ నిరంతరం నిఘా ఉంచాలి
కలెక్టర్ రాహుల్‌శర్మ