
ప్రకృతి ప్రేమికుడు
ఏటూరునాగారం: చేసేది టెంట్‌హౌజ్ వ్యాపారం... కానీ ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్క నాటుతాడు. ఉదయం నిద్రలేవగానే మొదట మొక్కలకు నీళ్లు పట్టిన తన దినచర్యను ప్రారంభిస్తారు. ఏటూరునాగారంలోని 5వ వార్డుకు చెందిన మార్కండేయ. ఇప్పటి వరకు కాలనీలో 40 మొక్కలు, రామాలయంలో 540, తన ఫంక్షన్‌హాల్‌లో 420 మొక్కలు నాటాడు. తన ఫంక్షన్ హాల్‌ను నందన వనంగా మార్చాడు. ఇదే కాకుండా పోలీస్‌స్టేషన్, ఎంపీడీఓ ఆఫీస్, రోడ్ల వెంట కూడా మొక్కలు నాటాడు. అందులో పూలు, పండ్ల మొక్కలు నాటడమంటే ఎంతో ఇష్టం. ఇవే కాకుండా రోడ్ల వెంట నీడనిచ్చే మొక్కలను నాటడం కోసం తోటి వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన వేయి మొక్కలను నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచాడు.