
హరితం.. ఆనందం
మొక్కలు, చెట్లను పసిపాపల్లా పెంచుతున్న వనప్రేమికులు
మొక్కల పెంపకమే ప్రాణం పర్యావరణ హితమే వ్యాపకం
వృక్షాలను రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయనే నానుడి. దానిని నిజం చేస్తూ మొక్కల పెంపకాన్నే వ్యాపకంగా చేసుకున్నారు అనేకమంది. ఇంటి ఆవరణలోనే చెట్లను పెంచుతూ పర్యావరణానికి దన్నుగా నిలుస్తున్నవారు కొందరైతే.. పెద్దల స్మారకార్థం మొక్కలతో బృందావనాన్నే పెంచుతున్నవారు మరికొందరు.. ఇలా అనేక పూలు, పండ్ల మొక్కలతోపాటు ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లను పెంచుతూ ప్రాణంగా చూసుకుంటున్నారు. చెట్లు, మొక్కలను పెంచుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ వాతావరణాన్ని కాపాడుతున్న వారి వివరాలే నేటి ‘సాక్షి’ సండే స్పెషల్.
చిట్యాల: జన్మనిచ్చిన అమ్మ మృతి చెందడంతో తట్టుకోలేక ఆమెకు గుర్తుగా మొక్కలను నాటి భద్రంగా చూసుకుంటున్నారు.. ముగ్గురు కుమారులు. మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన మేరుగు పద్మ గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందింది. అమ్మ దూరం కావడంతో ఆమె కుమారులు నాగేందర్, మహేందర్, రాజేందర్.. తల్లిపేరిట రెండు గుంటల్లో బృందావనం ఏర్పాటు చేసి మొక్కలను నాటి కాపాడుకుంటున్నారు.. వీరు పెంచుతున్న వాటిలో జౌషధ మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. అమ్మకు మొక్కలంటే ఎంతో ఇష్టమని అందుకే మొక్కలను నాటామని, మొక్కల వద్ద లైటింగ్‌తోపాటు పక్షులకు నీరు, దాన అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నారు.. ఈ అన్నదమ్ములు.
అమ్మ ప్రేమకు గుర్తుగా..

హరితం.. ఆనందం

హరితం.. ఆనందం