
బదిలీపై వెళ్తున్న మేనేజర్‌కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఆరో గని మేనేజర్ రామ్ భరోస్ మెహతో బదిలీపై వెళ్తున్న సందర్భంగా స్థానిక జీఎం కార్యాలయంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. గనిలో ఉత్పత్తి, ఉత్పాదకతలను మేనేజర్ మెరుగు పరిచారని కొనియాడారు. ఉద్యోగులతో సౌమ్యంగా వ్యవహరిస్తూ గనిని అభివృద్ది పథంలో నడిపించడానికి కృషి చేసినట్లు తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, రవికుమార్, రవీందర్, ప్రసాద్, సురేఖ, మారుతి, సిబ్బంది ఉన్నారు.