
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 58 మంది ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రజావాణి దరఖాస్తులతో పాటు ప్రజాభవన్, హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి పరిష్కార నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్