
ఎండుతున్న నారు మడులు
జిల్లాలో వర్షాలు సంవృద్ధిగా కురవకపోవడంతో వరి నారు మడులు, కూరగాయల మొలకలు ఆదిలోనే ఎండిపోతున్నాయి. జూన్ నెల చివరలో కురిసిన వర్షాలతో జిల్లాలో రైతులు చెరువుల కింద వరి నార్లు, వర్షాదార పంటల సాగు ప్రారంభించారు. జూలై మొదటివారంలో కొంతమేర వర్షాలు కురవడంతో వరి గింజలు, ఇతర గింజలు మొలకెత్తాయి. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో భూపాలపల్లి, మల్హర్ మండలాల పరిధిలోని కాశీంపల్లి, జంగేడు, కొంపల్లి, కుంభంపల్లి, అన్‌సాన్‌పల్లి, నాచారం శివారుల్లోని పొలాల్లో వర్షాధార వరి నార్లు, కూరగా యల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పంట పొలా లు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి.
– భూపాలపల్లి అర్బన్/మల్హర్
మల్హర్ మండలం అన్‌సాన్‌పల్లి శివారులో
ఎండిన వరి నారు
భూపాలపల్లి మండలం జంగేడు శివారులో ఎండిన వరి నారు

ఎండుతున్న నారు మడులు

ఎండుతున్న నారు మడులు

ఎండుతున్న నారు మడులు