
ఆధునిక హంగులతో పోలీస్‌స్టేషన్
రేగొండ: కొత్తపల్లిగోరి మండలానికి నూతనంగా ఏర్పాటైన పోలీస్‌స్టేషన్‌ను ఆధునిక హంగులతో నిర్మిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం తాత్కాలిక భవనాన్ని డీఎస్పీ సంపత్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తపల్లిగోరి మండలానికి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారని తెలిపారు.
ఇసుక అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు తెలిపిన ధరల ప్రకారం ఇసుక సరఫరా చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ట్రాక్టర్లను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా కోసం గ్రామాల్లో ఎవరైనా డంప్‌లు ఏర్పాటుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద్, మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, కాటం సదయ్య, వీరబ్రహ్మం, సుదర్శన్, పత్తి తిరుపతి, పుట్ట రవి, ప్రేమాజీ, పల్లెబోయిన తిరుపతి, పసుల రాకేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
స్థల పరిశీలన
రేగొండ: కొత్తపల్లిగోరి మండలానికి పోలీస్‌స్టేషన్ మంజూరు చేస్తూ జీఓ విడుదల కావడంతో శుక్రవారం మండలకేంద్రంలోఎస్పీ కిరణ్‌ఖరే పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. తాత్కాలిక పోలీస్ స్టేషన్ భవన సముదాయాన్ని పరిశీలించి, మరమ్మతుల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్, ఎస్సై సందీప్‌కుమార్ పాల్గొన్నారు.

ఆధునిక హంగులతో పోలీస్‌స్టేషన్