
శిక్షణ తరగతులు నిర్వహించాలి
రేగొండ: గ్రామాలలో వైద్యసేవలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆర్‌ఎంపీ, పీఎంపీల జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్, దుబాసి బాలరాజు అన్నారు. ఆదివారం మండలంలోని కోటంచ ఆలయ ప్రాంగణంలో సంఘం జిల్లా ఈసీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్‌ఎంపీలకు శిక్షణ తరగతులు నిర్వహించేవారన్నారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని సూచించారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు, నియోజక వర్గంలో మౌలిక వసతులకు ప్రాధాన్యన ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో రూ.3 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటుచేసిన బోరు మోటారును స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా రాజవీరు
భూపాలపల్లి రూరల్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా రాజవీరును ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చిట్యాల శశికుమార్, జాలిగాపు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా మూషిక రమేష్, సహాయ కార్యదర్శులుగా యుగేందర్, రమేష్, కోశాధికారిగా అంకం సదానందం, సహాయ కోశాధికారి తిరుపతితో పాటు తదితర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మొగుళ్లపల్లి: మండలంలోని మేదరమెట్ల గ్రామ శివారులోని చలివాగు నుంచి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్‌లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. మేదరమెట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు మంద హరీశ్, కొనుకటి దీక్షత్, పెండ్లి భూపతి, కొనుకటి ప్రవీణ్, పెండ్లి అరవింద్ అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా రంగాపురం శివారులో పట్టుకుని వారిపై నమోదు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిన్న కాళేశ్వరం పైపులైన్‌పై
నిపుణుల పరీక్షలు
కాళేశ్వరం: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పఽథకానికి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన పైపుల (గ్లాస్ రేయిన్‌ఫోర్స్‌డ్ పాలిషిడ్) నాణ్యతా ప్రమాణాలను నిట్ ప్రొఫెసర్ల బృందం ఆదివారం పరిశీలించింది. పదేళ్లుగా వానకు తడుస్తూ.. ఎండకు ఎండటంతో నాణ్యతను పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల ఇరిగేషన్ శాఖను ఆదేశించగా.. ఇరిగేషన్‌శాఖ లేఖను వరంగల్ నిట్ ప్రొఫెసర్లు పంపించారు. దీంతో ఆదివారం శిరీష్, రఘురాజు, జయ్‌పటేల్ వచ్చి పైపులను పరిశీలించారు. అమర్చిన, బయట నిల్వ ఉంచిన పైపులను పరీక్షించి కొన్ని నమూనాలను ల్యాబ్‌కు తీసుకెళ్లినట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. త్వరలో పరీక్షలకు సంబంధించిన వివరాలు రానున్నాయని వారు పేర్కొన్నారు. దీంతో నాణ్యతా ప్రమాణాలపై దృష్టిసారించినట్లు తెలుస్తుంది. వారివెంట ఇన్‌చార్జ్ ఈఈ సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఈ యాదగిరి ఉన్నారు.

శిక్షణ తరగతులు నిర్వహించాలి

శిక్షణ తరగతులు నిర్వహించాలి

శిక్షణ తరగతులు నిర్వహించాలి