
తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి
కాళేశ్వరం: తెలంగాణ సస్యశామలంగా ఉండాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని కోరానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆలయ రాజ గోపురం వద్దకు రాగా.. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆలయంలోని ద్విలింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూపరింటెండెంట్ శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరాలయం మహా అద్భుతమని, రానున్న రోజుల్లో గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
కాళేశ్వరాలయంలో పూజలు