
భరోసా ఏది..?
పెట్టుబడి కోసం కౌలురైతుల ఎదురుచూపు
ఎలా గుర్తించాలో
స్పష్టత కరువు..
ఇప్పటికే జిల్లాలో వానాకాలం సాగు షురూ అయింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పట్టాదారులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. కౌలు రైతుల వివరాలు లేవు. వీరిని ఎలా గుర్తించాలనే దానిపై స్పష్టత లేదు. జిల్లాలో కౌలు రైతులతో పాటు చిన్న, సన్నకారు రైతులు కలిపి సుమారుగా 35వేలకు పైగా ఉన్నారు. వీరు రైతు భరోసా కింద సాయం అందుతుందని ఆశిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 12లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం(రైతు భరోసా) రూ.120కోట్లకు పైగా సహాయం అందుతుంది. కౌలు రైతులకు కూడా సాయం అందిస్తే సంఖ్య మరింత పెరగనుంది.
కొంపెల్లి శివారులో పత్తికి గుంటుక కొడుతున్న రైతు
భూపాలపల్లి రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో కౌలు రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కౌలు రైతులకు సైతం ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 19 నెలలవుతోంది. గత వానాకాలం, యాసంగి సీజన్‌లో ఇవ్వలేదు. ఈ సారైనా హామీ నెరవేరుతుందనే ఆశలో కౌలు రైతులు ఉన్నారు.
ఆశగా ఎదురుచూపు..
జిల్లాలో సుమారు 35వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు 2016లో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. ఆరెకరం భూమి ఉన్న రైతులు ప్రతిఏటా తమకున్న కొద్దిపాటి భూమితో పాటు ఇతరుల పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. పత్తి, మిర్చి తోటలకు ఎకరాకు కౌలు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు చెల్లిస్తున్నారు. వరి పొలాలకు రూ.12వేల వరకు చెల్లిస్తున్నారు. పంట చేతికొచ్చినా, రాకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తుంది. సాగుకు కావాల్సిన, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కౌలు, చిన్న, సన్న కారు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసాలో భాగంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని అంటున్నారు.
జిల్లాలో సుమారు 35వేల మంది..
గుర్తింపులో స్పష్టత కరువు
నెరవేరని కాంగ్రెస్
ఆరు గ్యారంటీల హామీ

భరోసా ఏది..?

భరోసా ఏది..?