జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

జనగామ రూరల్‌: పట్టణంలోని స్థానిక మినీ స్టేడియం ధర్మకంచలో ఆదివారం 14, 16 ఏళ్ల బాలబాలికల నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ సెలక్షన్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపికల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌ నారాయణ గౌడ్‌ మాట్లాడుతూ..క్రీడాకారులు క్రమశిక్షణతో పాల్గొని భవిష్యత్తులో క్రీడాకోటాలో మంచి ఉద్యోగాలు పొందాలని, తల్లిదండ్రులకు సమాజానికి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో వోక్సన్‌ యూనివర్సిటీ, కామ్కోల్‌, సంగారెడ్డిలో జరిగే జాతీయస్థాయి నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొంటారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గోపగోని సుగుణాకర్‌, యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హరికృష్ణ, అసోసియేషన్‌ కార్యదర్శి కొదురుపాక సారంగపాణి, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్‌ కుమార్‌, కోశాధికారి ఆవుల అశోక్‌, నిర్వహణ కార్యదర్శి వంచ చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లావాసి మోహనకుమారి గిన్నీస్‌ రికార్డు

జనగామ: పట్టణానికి చెందిన కోటోజు మోహనకుమారి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. కోటోజు వెంకటేశ్వర్లు కుమార్తె మోహనకుమారి మహిళా మనోవికాస్‌ బృందంతో కలిసి ఏపీలో నిర్వహించిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రాజెక్టులో భాగస్వామిగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్‌ రహిత వాతావరణం, మహిళా సాధికారతతో పాటు దేశభక్తి సందేశాన్ని చాటారు. ఈ ప్రాజెక్టులో 350 మంది మహిళలు కలిసి 47 వేల క్రోషే జాతీయ పతాకాలను తయారు చేశారు. వాటిని 12.18 కిలో మీటర్ల పొడవైన బంటింగ్‌గా అమర్చి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. భారతీయ సంప్రదాయ హస్తకళ, మహిళల సమష్టి శక్తి, దేశభక్తిని ప్రపంచస్థాయిలో చాటిన ఈ ఘనతలో మోహనకుమారి తన స్నేహితురాలు సుశ్మితతో కలిసి పాల్గొన్నారు. జనగామకు చెందిన మోహన కుమారి ఈ అంతర్జాతీయ రికార్డులో భాగస్వామి కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందించారు.

బాక్సింగ్‌ పోటీల్లో ఏబీవీ విద్యార్థుల ప్రతిభ

జనగామ రూరల్‌: హనుమకొండలోని జె.ఎన్‌. స్టేడియంలో ఆదివారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజియేట్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ 2025–26లో జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ న కు ఎంపికయ్యారు. వీరిలో కళాశాలకు చెంది న విద్యార్థులు కె. అంజలి, ఆర్‌. సాయి ప్రణతి, బి. నిఖిల్‌ గౌడ్‌, కె. శ్రీశాంత్‌ గౌడ్‌ ఉన్నారు. మహిళల పోటీలు రాజస్థాన్‌లో, పురుషుల పోటీలు ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్నాయి. ఎంపికై న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ డా. కె. శ్రీనివాస్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ డా. టి.కళ్యాణి, అధ్యాపకులు అభినందించారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

జనగామ రూరల్‌: జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్వర్యంలో జన జాతర జిల్లా ఉద్యమ యాదిసభ(కవులు కళాకారుల ఆత్మీయ సమ్మేళనం) పోస్టర్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈనెల 11న (ఆదివారం) సూర్యాపేట రోడ్డులోని ప్రణామ్‌ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌లో జరిగే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి కవులు, కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్‌, ఇనుముల నర్సయ్య, చిలుమోజు సాయికిరణ్‌, తాళ్లపల్లి లక్ష్మణ్‌ గౌడ్‌, రంగరాజు ప్రసాద్‌, గొలుసుల ఎల్లయ్య, రవి, ముత్తగారి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement