చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

జనగామ: సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఈనెల 5న (సోమవారం) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రశాంత్‌రెడ్డితో పాటు మార్కెట్‌ కమిటీ పాలక మండలి సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జనగామ పట్టణంలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజల ఆశలకు అనుగుణంగా

పనిచేస్తా: కొమ్మూరి

చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్‌ కమిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతీ ఒక్కరి సహకారంతో చేర్యాల మార్కెట్‌ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement