సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

పోలీస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రమేశ్‌

కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

మామునూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పోలీస్‌ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని, నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని పీటీసీ ప్రిన్సిపాల్‌ కె.రమేశ్‌ తెలిపారు. సోమవారం మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో పరిపాలన విభాగం అధికారుల ఆధ్వర్యంలో సీసీటీఎన్‌, సైబర్‌ నేరాల దర్యాప్తు పద్ధతులు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగం తదితర అంశాలపై సివిల్‌ కానిస్టేబుళ్లకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, ఈశిక్షణ ద్వారా తమ విధుల్లో పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని, నైపుణ్యాలను అబివృద్ధి చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్‌, సీఎల్‌ఐలు రాంమూర్తి, అశోక్‌, సత్యనారాయణ, నరేందర్‌, రాజ్యలక్ష్మి, నగేశ్‌, చంద్రశేఖర్‌, మహేశ్‌, దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్‌, సమ్మిరెడ్డి, షర్మిల, అరుణ, సీసీ రామాంజరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement